
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్ర షూటింగ్ వాస్తవానికి జనవరిలో మొదలు కావాల్సింది, కానీ ప్రభాస్ ఇతర చిత్రాల కారణంగా ఏప్రిల్‌లో మొదలుపెట్టేలా ప్లాన్ చేశారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాజసాబ’ చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో, ‘స్పిరిట్’ షూటింగ్ అక్టోబర్‌లో మొదలవనున్నట్లు సమాచారం. దసరా తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రం కోసం ప్రభాస్ లుక్‌ను పూర్తిగా మార్చాలని సందీప్ రెడ్డి కోరగా, ప్రభాస్ కూడా దానికి సమ్మతించినట్లు సమాచారం. 2023లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత, సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.