Prabhas: రామ‌గుండం సీపీని క‌లిసిన ప్ర‌భాస్‌.. త‌ర‌లివ‌చ్చిన భారీ ఎత్తున అభిమానులు!

Prabhas: బాహుబ‌లి ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు అనే విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా.. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ కాంబోలో ఆదిపురుష్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అలాగే కేజీఎఫ్ చిత్రంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్ చిత్రంలో Prabhas ప్ర‌భాస్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Prabhas అయితే ఈ సినిమా షూటింగ్ కోసం గోదావ‌రిఖ‌నిలోని బోగ్గు గ‌నిలో యాక్ష‌న్ బ‌రిలోకి దిగాడు ప్ర‌భాస్‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ రామ‌గుండం క‌మిష‌న‌రేట్‌కు వ‌చ్చి ఆ ప్రాంత సీపీ స‌త్య‌నారాయ‌ణ‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. దీంతో సీపీ స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భాస్‌కు పోలీస్ సిబ్బందిని ప‌రిచ‌యం చేశారు. ఇక రామ‌గుండం సీపీ కార్యాల‌యానికి Prabhas ప్ర‌భాస్ రావ‌డం పెద్ద ఎత్తున ప్ర‌భాస్ అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌స్తుతం ప‌దిరోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఇందుకోసం ఆర్జీ-3 ఓసీపీ-2 ప్రాజెక్టు వ‌ద్ద భారీ సెట్టింగ్ వేశారు.