నారప్ప రిలీజ్ డేట్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్ప రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయింది. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ బాబు,కలైపులి ఎస్‌.థాను దీనిని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ సినిమా రీమేక్‌ను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

NARAPPA RELEASE DATE

ప్రియమణి, కార్తీక్‌ రత్నం, ప్రకాశ్‌ రాజ్‌, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల కొన్ని సీన్లు బలంగా లేకపోవడంతో.. మళ్లీ రీషూట్ చేశారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ రెండు పోస్టర్లను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో రక్తం అంటుకున్న కత్తితో వెంకటేష్ సీరియస్ లుక్‌లో కనిపించాడు.