పెద్దనాన్న జుట్టు సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కొత్త డ్రెస్ ధరించి కొత్త లుక్‌లో కనిపించాడు. అయితే కృష్ణంరాజు జట్టును ప్రభాస్ సరిచేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ప్రభాస్ తన జుట్టు సరిచేస్తుండగా.. కృష్ణంరాజు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక పక్కనే ఉన్న ప్రభాస్ పెద్దమ్మ కూడా అలాగే చూస్తూ నవ్వుతూ కనిపించింది.

prabahs and krishnam raju video

ఈ వీడియోను చూసి ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తండ్రి,కొడుకుల బంధం అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ నటిస్తుండగా.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో చేయనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ చేయనున్న ఆదిపురుష్ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది.