మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచిన బుట్టబొమ్మ

టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే. ఆమె అల.. వైకుంటపురంములో హిట్టుతో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ని మరింత పెంచేసింది. వరుస మెగా బ్లాక్‌బస్టర్‌ల అందడంతో పూజా హెగ్డే కోరుకున్నంత ఇవ్వడానికి కొన్ని బడా నిర్మాణ సంస్థలు కూడా రెడీ అంటున్నాయి. అయితే ఇటీవల కోవిడ్ 19 సంక్షోభం కారణంగా తారలు వేతనంలో 20 శాతం తగ్గించాలని టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయించారు.

ఈ నిర్ణయం ఉన్నప్పటికీ, పూజా హెగ్డే తన చెల్లింపు చెక్కును పెంచినట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే ఆమెకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ చిత్రనిర్మాతలు ఆమె డేట్స్ అడిగితే ఊహించని విదంగా 2.5కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే నెక్స్ట్ ప్రభాస్ యొక్క “రాధే శ్యామ్” మరియు అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.