వీరి వీరి గుమ్మడి పండు, వీరిలో సినిమా ఎవరితో ఉండు?

తెలుగు హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేతిలో ఉన్న పూజా, రీసెంట్ గా బోనీ కపూర్ ని కలిసింది. ఈ ఇద్దరి కలయిక నుంచి బయటకి వచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే బోనీ కపూర్, పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం పింక్ రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కాబట్టి ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ కోసమే పూజా బోనీని కలిసింది అనే వార్త వినిపిస్తోంది. పింక్ సినిమా అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది… హిందీలో తాప్సి, తమిళ్ లో శ్రద్దా శ్రీనాథ్ ఈ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తెలుగు రీమేక్ లో ఆ క్యారెక్టర్ తాను చేస్తే కెరీర్ కి మంచి బూస్ట్ అవుతుందని పూజ ఆలోచిస్తుందని నెటిజెన్స్ అనుకుంటున్నారు.

pooja hedge

పవన్ కళ్యాణ్ తో మాత్రమే కాకుండా బోనీ కపూర్ అజిత్ తో కూడా సినిమా చేస్తున్నాడు. ఈ కలయికలో రానున్న రెండో సినిమా ఇది. పూజ, అజిత్ సినిమాలో అవకాశం కోసమే బోనీ కపూర్ ని కలిసింది అనే ఊహాగనాలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే స్టార్ స్టేటస్ అందుకున్న పూజా, తమిళ్ లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే అజిత్ సినిమా కన్నా మంచి ఛాన్స్ మరొకటి ఉండదు. ఇది తెలుసు కాబట్టే పూజ, పవన్ పింక్ రీమేక్ లో కాకుండా అజిత్ సినిమాలో ఛాన్స్ అడిగిందని సమాచారం. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీలో పూజా నటిస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.