2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ తో ‘పుష్ప’ సినిమాని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ తోనే మెప్పించిన చిత్ర యూనిట్, కరోనా కారణంగా షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు అన్ లాక్ స్టార్ట్ అవ్వడంతో అల్లు అర్జున్ అండ్ టీం పుష్ప షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ముందులాగా శేషాచలం అడవుల్లో షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో, చిత్ర యూనిట్ పుష్ప షూటింగ్ ని తెలంగాణ అడవుల్లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయమై బన్నీ అండ్ కో ఆదిలాబాద్ లోని కుంతల వాటర్ ఫాల్స్ లొకేషన్ కి వెళ్లారు. అల్లు అర్జున్ కుంతల ఫారెస్ట్ కి వెళ్లడంతో అది తెలిసిన అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీల కోసం వెళ్లారు. ఈ తంతు అంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కరోనా సమయంలో అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో ఆంక్షలు ఉంటే అల్లు అర్జున్ కుంతలకి ఎలా వెళ్లాడని ప్రశ్నిస్తూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ రాజు పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన నేరేడిగొండ ఎస్సై భరత్ సుమన్… ఆంక్షలు ఉన్నా అల్లు అర్జున్ ఇక్కడికి రావడం ఫారెస్ట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారని, ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతున్నట్టు కానీ లొకేషన్ రెక్కీ జరుగుతుందన్న విషయం కానీ మాకు తెలియదు అని ఈ విషయంలో విచారణ జరుగుతుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయమై పుష్ప యూనిట్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.