రివ్యూల విషయంలో కేరళ కోర్ట్ లో హల్చల్ – శక్తీ, దరువు సినిమాలు ప్లాప్ కి కారణం ఇదేనా

సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ప్రతికూల సమీక్షలు సినిమా కలెక్షన్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయా లేదా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో, కేరళ హైకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సినిమాలను విడుదల చేసిన మొదటి 48 గంటల్లో సమీక్షించవద్దని సిఫార్సు చేసింది.

మన దేశంలో ప్రజలకు చెరువుగా ఉండి ప్రజలకు వినోదాన్ని ఇస్తాయి. ఈ సినిమాల మీద బ్రతికేవారు, అలాగే సినిమాలోని నమ్ముకుని వచ్చిన వారు, సినిమా అంటే ఆసక్తి ఉన్నవారు ఎందరో ఉన్నారు. సినిమాకి ఎంతో మందికి ప్యాషన్. అయితే ఇటువంటి సినిమాలు ఇవాల్టి రోజున మంచిగా థియేటర్లో నడవాలి అంటే చాలా కష్టం అవుతుంది. దానికి ముఖ్య కారణం సినిమా రివ్యూలు. యూట్యూబ్లో అలాగే ఇంటర్నెట్ వెబ్సైట్లో, అలాగే వేరు వేరు సోషల్ మీడియా ప్లాట్ఫారంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి షోకే బయటకు వచ్చి రివ్యూ చెప్పడం వల్ల సినిమాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. అలా జరగడం ద్వారా సినిమాలు కలెక్షన్లకి చాలా కష్టం అవుతుంది.
అయితే ఈ విషయంపై కేరళ కోర్టులో ఓ ఇష్యూ నడుస్తుంది. సినిమా రిలీజ్ జరిగిన 48 గంటల వరకు యూట్యూబ్లో కానీ వెబ్సైట్లో కాని వేరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారం కానీ ఎటువంటి రివ్యూలు రాకూడదంటూ ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్ వేశారు. రివ్యూ త్వరగా రావడం వల్ల సినిమా ఎలా ఉండబోతుంది అనేది సినిమా చూడని ప్రేక్షకులకు ఒక అంచనా రావడంతో వాళ్లు సినిమా థియేటర్లకి వెళ్లడం లేదు అంటూ ఆ పిటిషన్ లో వివరించారు. అయితే కేరళ కోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
గతంలో కూడా తెలుగు సినిమాలు అయినటువంటి దరువు శక్తి సినిమాలో కూడా ఇదేవిధంగా ఇష్యూలు జరిగిన విషయం మనకు తెలిసింది. ప్రస్తుతం సినిమాలు ఉన్న పరిస్థితుల్లో ఈ రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలకు నష్టం వాటిల్లుతుందంటూ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మనం కేరళ కోర్టు తీర్పు కోసం వేచి చూడాల్సిందే.