సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఖర్చుపెట్టి ఒక సినిమాకి వెళ్లాలంటే అది కచ్చితంగా వాళ్లకు తృప్తినిచ్చేలా ఉండాలని ప్రేక్షకులు అనుకుంటారు. చిన్న సినిమా గాని వస్తె ఎక్కువగా సినిమా విడుదలైన తర్వాత టాక్ బట్టి వెళ్ళాల లేదా అనేది ఆలోచిస్తారు. బలగం వంటి చిన్న సినిమాలు కూడా మొదటి రెండు రోజులు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత సినిమాకు వచ్చిన టాక్ వల్ల బలగం సినిమా అంత గొప్ప విజయం సాధించింది. అదే తరహాలో హనుమాన్ సినిమా కూడా అప్పుడు మార్కెట్లో ఉన్న సినిమాలతో పోలిస్తే చిన్న సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోవడం జరిగింది. అయినప్పటికీ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ముందుగానే సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లి తద్వారా టాక్ వల్ల సినిమా మంచి విజయం సాధించేలా జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు అదే తరహాలో పేకమేడలు అనే మరో కంటెంట్ ఉన్న చిన్న సినిమా వస్తుంది. ఎన్నో తమిళ్ సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ తన నటనను ప్రూవ్ చేసుకున్న వినోద్ కిషన్ హీరోగా తెలుగులో రాబోతున్న సినిమా పేకమేడలు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా స్మరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హరిచరణ్ డిఓపిగా పనిచేస్తున్న ఈ సినిమాను నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో రాకేష్ వర్రె నిర్మించారు.