‘పేక మేడలు’ సినిమా జెన్యూన్ రివ్యూ

నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలలో పాత్రలు చేస్తూ ఇప్పుడు తొలిసారి తెలుగులో హీరోగా వినోద్ కిషన్ నటిస్తూ వచ్చిన సినిమా పేక మేడలు. ఈ సినిమాలో అనూష కృష్ణ హీరోయిన్ నటిస్తుండగా నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహించారు. క్రేజీ యాంట్స్ నిర్మాణ సంస్థ నుండి నటుడు రాకేష్ వర్రె ఈ సినిమాను నిర్మించగా స్మరణ్ సాయి సంగీతాన్ని సమకూర్చారు.

కథ:
హైదరాబాద్ నగరంలోని బస్తీలో నివసించే ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో ఈ సినిమా తెరకి ఎక్కించడం జరిగింది. మనం చూస్తూ ఉండే ఓ సామాన్య మధ్య దగ్గర కుటుంబంలోని కష్టాలను అలాగే జీవన శైలిని చూపిస్తూ ఓ బాధ్యతారహిత భర్త తన భార్య పిల్లలను పట్టించుకోకుండా షార్ట్ కట్స్ ద్వారా డబ్బు సంపాదించాలని అత్యాశకు పోతూ గాలిలో మేడలు కట్టే కలలు కంటూ ఎటువంటి తప్పులు చేశాడు ఆ తప్పులు వల్ల తన కుటుంబం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. అయితే చివరకు అతడు మారి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడా లేదా తన శైలిలో తాను ముందుకు పోతూ ఉంటాడా? తన భార్య పిల్లలు జీవితం అతడు చేసిన తప్పుల వల్ల ఎటువంటి మలుపులు తిరిగింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం పేక మేడలు సినిమాలో ప్రేక్షకులకు దొరుకుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
సినిమాలో ఎన్ని పాత్రలో ఉన్నప్పటికీ ముఖ్యపాత్రులైన లక్ష్మణ్ గా నటించిన వినోద్ కిషన్ అలాగే తన భార్య వరలక్ష్మి గా నటించిన అనూష కృష్ణ పాత్రలు మనకు చివరకు కనిపిస్తూ ఉంటాయి. సినిమాలో ఎవరికీ తగ్గ పాత్రలు వారు చేసినప్పటికీ ఈ ఇద్దరి నటన వల్ల సినిమా ప్రేక్షకులను మరింత ఆకర్షణీయంగా చేసింది. దర్శకుడు నీలగిరి మామిళ్ళ కూడా సినిమాలో ఓ పాత్ర చేయడం గమనియకం. అలాగే బలగం సినిమాలో నటించిన మురళీధర్ గౌడ్ ఇంకా కొందరు ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ:
ఈ సినిమా ఒక డ్రామా అయినప్పటికీ ఎక్కడ కూడా చూసేవాడికి ఒక కొత్త కథ చూస్తున్నమే అనిపించదు. సామాన్యంగా ప్రేక్షకులు తమ ఇంట్లో తమ చుట్టుపక్కల చూసే జీవితాలను అలాగే జీవన విధానాలను తెరపై చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమాలో ఎక్కడికి తగ్గట్లు అక్కడ స్మారన్ సాయి తన సంగీతంతో ప్రేక్షకులను మెప్పించారు. స్క్రీన్ ప్లే మొదటి హాఫ్ లో కొంచెం నిదానం అనిపించినప్పటికీ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాజిటివ్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:
స్లో స్క్రీన్ ప్లే, అక్కడక్కడ అవసరంలేని డ్రామా.

కుటుంబ సమేతంగా ముఖ్యంగా ఆడవారు చూడవలసిన సినిమా పేక మేడలు.