పవన్ కళ్యాణ్, వెంకటేష్.. మరో హిట్ రీమేక్?

విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ‘నారప్ప’ సినిమాతో బిజీగా ఉన్న వెంకటేష్ ఆ తరువాత ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే ఆయన పవన్ కళ్యాణ్‌తోనే ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఆ మల్టీస్టారర్ మూవీ మరేదో కాదు.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’. మొదట ఈ సినిమాను వెంకటేష్ రానాతో కలిసి సురేష్ బాబు హోమ్ ప్రొడక్షన్ లోనే నిర్మించాలని అనుకున్నారు.. కానీ సినిమా హక్కులను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కు చెందిన సితార ఎంటర్టేన్మెంట్స్ దక్కించుకుంది. దీంతో ప్లాన్స్ మారాయి.  సురేష్ ప్రొడక్షన్స్‌ కోరిక మేరకు కలిసి నిర్మించాలని డిసైడ్ అయ్యారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్‌లతో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.