వకీల్ సాబ్ టీజర్ రిలీజ్.. అప్పుడేనా?

పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. దీంతో అభిమానులు వకీల్ సాబ్ విషయంలో కాస్త నీరాశ చెందుతున్నారు.

ఆ సంగతి పక్కనపెడితే.. సినిమా టీజర్ పై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. త్వరలో వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఇంకా ఎంతో దూరం లేదు. సెప్టెంబర్ 2కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు పవర్ స్టార్ టీజర్ గనక రిలీజ్ అయితే సోషల్ మీడియాలో పాత రికార్డులని బ్లాస్ట్ అవుతాయని చెప్పవచ్చు. అందుకే వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ బర్త్ డే కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.