త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు మించి అనేలా బిజినెస్ అయితే ఉంటుంది. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ఇప్పటికి ఒక రికార్డ్ అనే చెప్పాలి. అలాంటి కాంబో మరోసారి సెట్టయితే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబో ఉంటుందట. కానీ.. మరో దర్శకుడు కూడా వీరితో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ వకీల్ సినిమాతో పాటు క్రిష్ సినిమాను కూడా ఫినిష్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అనంతరం హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఆ తరువాత 29వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారికి త్రివిక్రమ్ కథ, మాటలు అందించడానికి కూడా రెడీగా ఉన్నారట. ప్రస్తుతం ఈ టాక్ ఫిల్మ్ నగర్ లో గట్టిగానే వైరల్ అవుతోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సెప్టెంబర్ 2వరకు వెయిట్ చేయాల్సిందే.