శ్రీదేవి బ్యూటీఫుల్ ఫొటోస్: చీరకట్టులో మైమరిపించే అందం

గురువారం శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ని చూస్తే అర్ధమవుతోంది. బ్యూటీఫుల్ అనే పదానికి ఆమె మరో అర్డంలా నిలిచారు. ఆమె ఉన్నన్ని రోజులు చెరగని చిరునవ్వుతో అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేశారు. ఇక ఆమె ఎప్పుడు చీర కట్టినా కూడా ఎంతో అందంగా కనిపించే వారు.

మగవాళ్ళు ఆమె అందాన్ని చూసి మురిసిపోతే ఆడవాళ్లు మాత్రం అతిలోక సుందరి స్పెషల్ డిజైన్స్ పై ఫోకస్ పెట్టేవారు. ఇక ఆమెకు సంబంధించిన వివిధ రకాల శారీ లుక్స్ పై ఒక లుక్కేస్తే ఆమె సౌందర్యంలో ఉండే కిక్కు అర్ధమవుతుంది. బంగారపు చీర కట్టినా సాధారణ చీర కట్టినా కూడా శ్రీదేవి తన నవ్వుతోనే చీరలకు అందాన్ని తెచ్చేది. ఇక ఆమె ఎంత హెవీ జ్యూవెలరీ ధరించిన కూడా ఆమె అందంతో ఈజీగా కలిసిపోయేవి. అంతలా శ్రీదేవి తన బ్యూటీనేస్ తో మైమరిపించేలా చేసేది. ఇక ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.