రోజురోజుకి పవన్ కళ్యాణ్ అభిమానులలో క్రేజ్ పెంచుతున్న OG

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం, ‘దే కాల్ హిమ్ OG’ ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మూవీ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్‌మైషోలో చాలా మంది వినియోగదారులను ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే 50K ఇంటెరెస్ట్లు సైట్‌లో నమోదు చేయబడ్డాయి. ఇది యాక్షన్ డ్రామాకి ఉన్న క్రేజ్ & డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.