ఈ రోజు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీ ని కలిశారు. పూల బొకే తో ప్రధానికి శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కూర్చుని చర్చలు జరిపారు. ఆ తరువాత ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్ తో కలిసి చిరంజీవి గారి ఇంటికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంఎల్ఏ అయినా తరువాత అన్న చిరంజీవిని కలవడం ఇదే తొలిసారి. అయితే ఎంఎల్ఏ అయినా తరువాత తొలిసారి వస్తున్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కుటుంబం అంతా గణ స్వాగతం పలికారు. గులాబీ పూల రేఖలతో వర్షం కురిపించారు. మెగా అభిమానులు, జనసైనికులు బాణాసంచా కాల్చి సంబరపడ్డారు.
చిరంజీవి ఇంటికి చేరిన వెంటనే పవన్ కళ్యాణ్ దంపతులు తల్లి అంజనా దేవి గారికి, అలాగే అన్న చిరంజీవి సురేఖ దంపతులకు పాదాభి వందనం చేసారు. ఆ తరువాత చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు గులాబీ మాల వేసి ఇంటికి ఆహ్వానించారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడం చూసి నాగబాబు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. ఆయనకు ఆనంద బాష్పాలు ఆగలేదు. ఇది అంత చూస్తున్న సాయి దుర్గ తేజ్ సంతోషంతో విజిల్స్ వేసాడు. ఇది అంత వీడియో రూపంలో చూస్తున్న మెగా అభిమానులుగా ఓ కన్నుల పండుగలా ఉంది. రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పులా బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా కుటుంబం అంత కలిసి కేక్ కట్ చేసి ఓ పండుగల ఈ వేడుకను జరుపుకున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.