జనసేనానిగా పవన్ కళ్యాణ్ మారక ముందు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గా ఆయన నటించిన చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ దర్శకత్వంలో 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి, 2018 సంక్రాంతికి విడుదలైంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ అజ్ఞాతవాసి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటికీ ఎన్నో టెరిటరిస్ లో అజ్ఞాతవాసి రికార్డ్స్ అలానే ఉన్నాయి.
ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్ 20న సోషల్ మీడియాలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అజ్ఞాతవాసి 100 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. ‘ఎవడు 3’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ 100 మిలియన్ వ్యూస్‌ను అంటే 10కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ జనం జై కొట్టేశారు.
ఇక ఇదిలా ఉంటే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేస్తున్నాడా.. ? అంటే అవుననే వినిపిస్తోంది. మొన్నటి వరకూ ఇక సినిమాలకు రాడు అనే ప్రచారం జరిగినా.. రీసెంట్ గా జరిగిన సైరా మలయాళ ప్రొమోషన్స్ లో చిరు మాట్లాడుతూ లూసిఫర్ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కమ్ మాఫియా డాన్ పాత్రలో మోహన్ లాల్ నటించాడు, తెలుగులో ఈ పాత్రలో చిరు నటించనున్నాడు. ఆయనకి రైట్ హ్యాండ్, మాఫియా డాన్… షార్ప్ షూటర్ గా డైరెక్టర్ పృథ్వి నటించాడు. ఇదే పాత్రలో పవన్ కళ్యాణ్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్న డాన్, తమ్ముడు అన్నకి రైట్ హ్యాండ్… ఈ కాంబినేషన్ వింటుంటేనే మెగా అభిమానులకి కొత్త ఉత్సాహం వస్తుంది. పవన్ నిజంగా లూసిఫర్ సినిమాతోనే రిటర్న్ వస్తే పవర్ స్టార్ అభిమానులకి అంతకు మించిన ట్రీట్ ఇంకొకటి ఉండదు. నిజానికి పృథ్వి పాత్రకి ముందు రామ్ చరణ్ అనుకున్నారు కానీ మోహన్ లాల్ తమ్ముడిగా ఫారిన్ రిటర్న్ క్యారెక్టర్ ఒకటి లూసిఫర్ సినిమాలో ఉంది, ఆ పాత్రలో చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో చేసినా మెగా మనం సినిమాకి ఆడో ఎస్సట్ గా నిలిచిపోతుంది. మరి ఈ లూసిఫర్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి.