లూసిఫర్ సినిమాలో బాబాయ్ కూడా నటించాల్సిందే

తెలుగులో మన జనరేషన్ క్లాసిక్ అంటే టక్కున గుర్తొచ్చే సినిమాల్లో మనం ఒకటి. అక్కినేని హీరోలంతా కలిసి చేసిన ఈ సినిమా ఎన్నార్ కి ఘన నివాళిగా మిగిలిపోయింది. మనం సినిమాలో అక్కినేని హీరోలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన సినీ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి మెగా ఫ్యామిలీ కూడా రెడీ అవుతున్నారు. అక్కినేని హీరోలు అంటే సాఫ్ట్ ఇమేజ్ ఉన్న వాళ్లు కానీ మెగా హీరోలు అలా కాదు కదా. వారికి విపరీతమైన మాస్ ఇమేజ్ ఉంది, కంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించగల సత్తా ఉన్న స్టార్స్ మెగా ఫ్యామిలీలో ఉన్నారు.

మరి అలాంటప్పుడు అంతమంది హీరోలని బాలన్స్ చేస్తూ కథ దొరుకుతుందా? అనే అనుమానాలు ప్రతి అభిమానిలో ఉండేవి. అయితే సైరా ప్రొమోషన్స్ లో భాగంగా మలయాళ గడ్డపై అడుగుపెట్టిన చిరు చరణ్, మెగా మల్టీస్టారర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. కేరళ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించాడు. మోహన్ లాల్ మెయిన్ లీడ్ ప్లే చేసిన ఈ మూవీ అక్కడి రాజకీయాల చుట్టూ తిరుగుతుంది, పక్కా కమర్షియల్ కథకి ఉండాల్సిన లక్షణాలన్నీ లూసిఫర్ సినిమాకి ఉన్నాయి. పృథ్వి లూసిఫర్ సినిమాని డైరెక్ట్ చేస్తూనే ఒక మంచి పాత్రలో నటించాడు. ఈ సినిమాని తెలుగులో కూడా అతనే డైరెక్ట్ చేస్తాడేమో తెలియదు కానీ ఒకవేళ సెట్ అయితే మాత్రం మోహన్ లాల్ పాత్రలో చిరు, పృథ్వి రాజ్ పాత్రలో మాఫియా డాన్ రైట్ హ్యాండ్ పాత్రలో చరణ్ నటించనున్నారు.

ఈ రెండు పాత్రలు మాత్రమే కాకుండా లూసిఫర్ లో ఉన్న మరో ఇంపార్టెంట్ పాత్ర మోహన్ లాల్ తమ్ముడిది. రాజకీయ నాయకుడిగా ఉండే ఈ పాత్రని మలయాళంలో టోవినో థామస్ ప్లే చేశాడు. ఇదే పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చిరు చరణ్ మధ్య అంత మంచి రోల్ లో మరే హీరో సెట్ అవ్వడు కాబట్టి పవన్ కళ్యాణ్ లూసిఫర్ సినిమాలో నటించాల్సిందే. ఇదే జరిగితే లూసిఫర్ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర పెను విధ్వాంసమే సృష్టిస్తుంది. నిజానికి ఈ ముగ్గరు మెగా హీరోలు ఒకే సినిమాలో నటించాలి అంటే కథ ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది, లూసిఫర్ సినిమా విషయంలో ఆ భయం తీసేసి హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే లూసిఫర్ సినిమాకి కథే బలం, కథనం అదనపు బలం. సో ఎలాగూ రీమేక్ రైట్స్ చరణ్ కొన్నాడు కాబట్టి చిరు కొరటాల సినిమా అయ్యాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.