జనసేనలోకి చిరు ఎంట్రీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీలోకి త్వరలో మెగాస్టార్ చిరంజీవి వస్తారంటూ గత కొద్దిరోజుల క్రితం క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా పవన్‌కి అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారని, మద్దతు ఇస్తానంటూ చెప్పారంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరు చెప్పడంతోనే పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారని, మూడేళ్ల వరకు సినిమాలు చేసుకుని ఆ తర్వాత రాజకీయాలు మొదలుపెట్టారని పవన్‌కి చిరు సలహా ఇచ్చారన్నారు. నాదెండ్ల వ్యాఖ్యలతో త్వరలో చిరు జనసేనలో చేరబోతున్నారా? అనే ప్రచారం జరుగుతోంది.

pawan on chiru janasena

ఈ క్రమంలో జనసేనలోకి చిరు ఎంట్రీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ అన్నయ్య అభిప్రాయాలను గౌరవిస్తానని, ఆయన జనసేనలోకి చేరతారా? లేదా ? అన్న విషయం ఆయన అభీష్టం మీద ఆధారపడి ఉంటుందని పవన్ తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తారా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని, జనసేన పార్టీ ఓ నిర్ధిష్ట లక్ష్యాలతో ఏర్పడిందన్నారు. చిరంజీవి ఎప్పుడూ తన శ్రేయస్సునే కోరుకుంటారని, చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన నైతిక మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.