మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన న్యూ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకముందే పవన్ కళ్యాణ్ అనుకోకుండా బయటపెట్టెశారు. గతంలో మెగాస్టార్ ఆచార్య టైటిల్ ని అనుకోకుండా రివిల్ చేసినట్లుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెహర్ రమేష్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే మెహర్ రమేష్ కూడా తనదైన శైలిలో పవర్ స్టార్ కి విషెస్ అందించగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ చెబుతూ నెక్స్ట్ శ్రీ చిరంజీవి గారితో చేయనున్న సినిమాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. దీంతో ఇన్ని రోజులు కన్ఫ్యూజన్ లో ఉన్న అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇది అజిత్ తమిళ్ సినిమా వేదళం రీమేక్ అనే టాక్ కూడా వస్తోంది. ఆ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు గాని మెహర్ రమేష్, మెగాస్టార్ కాంబినేషన్ లో మాత్రం ఒక ప్రాజెక్ట్ ఉంటుందని డైరెక్ట్ గా చెప్పేశారు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.