బొమ్మా బ్లాక్ బస్టర్: ‘నందు’ డిఫరెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్!!

బొమ్మ బ్లాక్ బస్టర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను నందూ తన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశాడు. యువ హీరో విశ్వక్ సేన్ ద్వారా ఈ పోస్టర్ లాంచ్ చేయబడింది. ప్రతిభావంతుడైన హీరో నందు విజయ్ కృష్ణ, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పోస్టర్లో నందు చాలా కొత్తుగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై కొంత బజ్ అయితే క్రియేట్ అవుతోంది.

ఇక పోతురాజు అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చిన చిత్ర యూనిట్ తప్పకుండా సినిమా సరికొత్తగా ఉంటుందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుద చేస్తూ విశ్వక్ సేన్ ఇలా వివరణ ఇచ్చారు, ‘పూరిజగన్ అభిమాని“ పోతురాజు ” అంటూ బ్లాక్‌బస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఈ సంవత్సరం కిర్రాక్ ఉండాలని విశ్వక్ విషెస్ అంధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విజయ్ భవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పదగళ, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మడ్డీ, మనోహర్ రెడ్డి ఈడా నిర్మించిన ‘బొమ్మా బ్లాక్ బస్టర్’ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు.