వైరల్ : నీల్ బర్త్ డే లో కలిసిన పాన్ ఇండియా స్టార్స్

పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్బంగా నిర్వహించిన పార్టీ లో ఒక పిక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది,
ప్రభాస్ – ప్రశాంత్ – యష్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ పిక్ వైరల్ గా మారింది. తమ దర్శకుడి కోసం టైం కేటాయించి ఇలా పార్టీకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక ప్రశాంత్, ప్రభాస్ అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు . ఈ ఇద్దరూ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో శ్రుతి హాసన్ కూడా పాల్గొంటోంది.

నీల్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ ఇద్దరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ డైనమైట్స్ కనిపించడంతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె వారు ట్విట్టర్ వేదికపై స్పెషల్ థాంక్స్ చెప్పారు.