ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మెడికల్ క్రైం థ్రిల్లర్ మయూరాక్షి

ఇటీవికాలంలో మెడికల్ క్రైం థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్ ను బాగా అలరిస్తున్నాయి. తాజాగా మలయాళంలో విడుదల అయి విజయం సాధించిన ఓ చిత్రం తెలుగులోకి అనువదించారు ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై అనువాదం చేశారు. ఇందులో జనతాగ్యారేజ్, భాగ‌మ‌తి ఫేం ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ జంటగా నటించారు. ఈ చిత్రం పేరు మ‌యూరాక్షి . యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్  ప్రేక్షకులను ఏమాత్రం అలరించింది అనేది చూద్దాం పదండి.

కథ: డాక్టర్ అజయ్… కేంద్ర మంత్రి చౌడప్ప మనుమరాలు ఝాన్సీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు కేంద్రమంత్రి చౌడప్ప హెల్త్ చెక్ అప్ కోసం జూనియర్ డాక్టర్ అజయ్ పనిచేసే ఆసుపత్రికి వెళతాడు. అక్కడ మంత్రికి బిపే ఎక్కువగా ఉండటంతో… డాక్టర్ అజయ్ ఇచ్చిన ఓ ఇంజెక్షన్ కారణంగా కేంద్ర మంత్రి గుండె పోటుతో మరణిస్తాడు. అయితే మంత్రికి గుండె పోటు వచ్చింది అజయ్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే మంత్రి మరణించాడని పోలీసులు అజయ్ పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. మరి కేంద్ర మంత్రి అజయ్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే మరణించాడా? డాక్టర్ అజయ్ ఈ కేసు నుంచి బయటపడ్డారా? డాక్టర్ అజయ్ కి… రాజీవ్ (ఉన్ని ముకుందన్) ఎలా సహాయపడ్డారు? మరి టైటిల్ రోల్ పోషించిన మయూరాక్షి (మియ జార్జి) ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: మెడికల్ క్రైం బేస్డ్ గా తెరకెక్కిన మూవీస్ ఎప్పుడూ థ్రిల్లింగ్ గానే వుంటాయి. వాటికి కొంచం సస్పెన్స్ కూడా జోడిస్తే ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చెయ్యొచ్చు. తాజాగా విడుదలైన ఈ మాయూరాక్షి కూడా అలాంటి మంచి ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లరే. ఫస్ట్ హాఫ్ అంతా డాక్టర్ అజయ్, ఝాన్సి ల మధ్య లవ్ ట్రాక్ ను సోసో గా నడిపించి ఇంటర్వల్ బ్యాంగ్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వల్ తరవాత అసలైన కథను అనేక మలుపులతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాడు దర్శకుడు. ఉన్ని ముకుందన్ , మియా జార్జ్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అలానే మినిస్టర్ మర్డర్ మిస్టరీలో వుండే మలుపులు, కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగు ప్రేకషకులకు బాగా పరిచయం అయిన మలయాళ యువ హీరో ఉన్ని ముకుంద న్ ఇందులో లవర్ బాయ్ గా, ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన మియా కూడా అడవి బిడ్డగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. డాక్టర్ అజయ్, అతనికి జంటగా నటించిన ఝాన్సీ కూడా బాగా నటించారు. ఝాన్సీ అమ్మగా, సుప్రీమ్ కోర్టు లాయర్ గా నటించిన నటీమణి కూడా కోర్టు సీనుతో మెప్పించింది. కేంద్ర మంత్రిగా, అతని కుమారుని గా నటించిన ఇద్దరు నటులూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న కథ…. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. గోపి సుందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి యాప్ట్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పిగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్…!!!