నందమూరి నటసింహం బాలకృష్ణ గారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ కు నామినేట్ అయ్యారు. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ నిమిత్తం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నామినేట్ అయిన వారి నుండి విజేతలను జనవరి 26 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ప్రకటిస్తారు.
వాస్తవానికి బాలయ్య కి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండగా.. చాలా ఆలస్యమైందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రకటించే పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో పాటు ఏపీ నుంచి పలువురి పేర్లను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.