పాయ‌ల్ రాజ్‌పుత్ ‘ర‌క్ష‌ణ‌’…టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు.

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం క‌ట్టిప‌డేయ‌నున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా… ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘ర‌క్ష‌ణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

న‌టీన‌టులు:

పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్,

నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్ ,

నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్,

ఛాయాగ్రహణం: అనిల్ బండారి,

సంగీతం: మహతి స్వ‌ర‌ సాగర్,

సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్,

ఎడిటర్: గ్యారి బి హెచ్,

స్టంట్స్: వెంకట్ మాస్టర్,

ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్,

రైటర్: తయనిధి శివకుమార్,

స్టిల్స్:ఎ. దాస్,

పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్,

వీఎఫ్ఎక్స్: అలగర్‌ సామి, మయాన్- ప్రదీప్ పుడి,

కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస,

పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా),

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి,

లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే,

ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల,

కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు,

మేకప్: కోటి లకావత్