ఆహా లో స్ట్రీమ్ కానున్న ‘పారిజాత పర్వం’

కంభంపాటి సంతోష్ దర్శకత్వంలో చైతన్యరావు లీడ్ రోల్ గా శ్రద్ధ దాస్, సునీల్, హర్ష చెముడు ముఖ్య పాత్రలలో నటిస్తూ మన ముందుకు వచ్చిన సినిమా పారిజాత పర్వం. దేవేష్, మహీధర్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం తియేటర్లలో మంచి హిట్ అందుకుంది. కిడ్నప్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అటు కామెడీ ప్రేక్షకులను, ఇటు సస్పెన్స్ ను కూడా బాగా బాలన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా. ఈ నెల 12వ తేదీ నుండి ఈ సినిమా ఆహా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెర మీద మిస్ అయినా ప్రేక్షకులకు ఇప్పుడు ఆహా ద్వారా ఈ సినిమా వినోదాన్ని అందించనుంది.