
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తూ పలువురు నటినటులు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎస్ వి సి బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ సుమారు 230 కోట్లు వసూలు చేసింది. అంతే కదా ఇప్పటికీ అనిల్ రావిపూడి చిత్ర పరిశ్రమకు వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మీడియా వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీడియో వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే 12 తీసిన సినిమా వల్ల ఇద్దరు కలెక్షన్స్ వచ్చాయంటే ఐటివారు దిల్ రాజు ఇంటిపై సోదాలు చేయడం మొదలు పెట్టారు అని మీడియా వారు అనగా దానికి సమాధానం గా అనిల్ రావిపూడి కేవలం దిల్ రాజు ఇంటి పైన మాత్రమే కాదు, మరికొందరు ఇండస్ట్రీ వారి పైన కూడా ఐటివారు సోదరులు చేస్తున్నారు. ఇప్పటికైతే నా ఇంటి పైన ఎటువంటి ఐటి రైడ్లు జరగలేదు అని అన్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమా కలెక్షన్స్ విడుదల చేసే పోస్టర్ లో ఉండే అంత నిజమైన కలెక్షన్స్ ఉండవని తెలుస్తుంది. మీ సంక్రాంతి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ ఎంతవరకు నమ్మవచ్చు అని విలేకరులు అడగగా మా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్, మేము ఎటువంటి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేయలేదు. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదంగా తీసుకుంటూ జిఎస్టి తో కలిపి మా సినిమా కలెక్షన్స్ పోస్టులు వేసుకున్నాము అన్నారు.
ఇదే సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ తనకు ఎటువంటి ఐటి రైడ్ గురించి తెలియదని, తాను అయితే పూర్తిగా తాను తీసుకునే రెమ్యూనరేషన్ అంతా వైట్ లోనే ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. తను తీసుకునేదే చాలా తక్కువ రెమ్యూనరేషన్ అని, తన లెక్కలు అన్ని చాలా క్లియర్ గా ఉంటాయని ఆయన తెలిపారు.