కాశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ లలో పాటలకు చిత్రీకరించడానికి వెళ్తున్న “ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ”
శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న చిత్రం “ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుని రెండు పాటల షూట్ కొరకు కాశ్మీర్ కు వెళుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల మధ్య టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ లు “ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ” చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్ , దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యి చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ముఖ్య అతిధిగా వచ్చిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. దాసరి గారితో నేను ఎక్కువగా ట్రావెల్ చేయడం జరిగింది.. ఆలా నాకు రేలంగి గారు నాకు బాగా పరిచయం. తను చేసిన చాలా సినిమాలు బిగ్ హిట్టయ్యాయి. అయన దర్శకత్వంలో ప్రసన్న చేస్తున్న ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రాఫ్ట్ తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారు.అన్ని తెలిసిన దర్శకుడు నరసింహా రావు గారు లాంటి దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత మంచి టైటిల్ తో నిర్మిస్తున్న ప్రసన్న గారికి ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… నిర్మాత ప్రసన్న గారు పిలిచి “ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ” సినిమా చేస్తారా అని అడిగారు. ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ డెవిల్స్. ఎన్నో హార్రర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది పూర్తి హార్రర్ సినిమా కాదు. ఇందులో కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఈ సినిమా అందరూ చాలా డెడికేటెడ్ గా చేశాము. ఇందులో హీరోలుగా యస్వంత్ , జబర్దస్త్ రాకేష్ లను,నటి సత్య కృష్ణ కూతురు అనన్య అయితే బాగా ఉంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది.ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీ లో మంచి క్యాస్టింగ్ తో, మంచి టెక్నిషియన్స్ తో ఈ సినిమా చెయ్యడం జరిగింది.కొన్ని పాటలు, మినహా సినిమా పూర్తి అయ్యింది. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాము అని అన్నారు.
చిత్ర నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. మా సినిమా అనౌన్స్ మెంట్ కార్య క్రమానికి వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ గారు భైరవ ద్వీపా నికి నంది అవార్డు విన్నర్ అయిన తను అప్పటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీ కి సేవ చేస్తూ ఆడియో గ్రాఫర్ యూనియన్ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, తరువాత ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జి బ్యూటర్స్ లకు నాయకుడిగా ఎదిగిన కొల్లిరామకృష్ణ గారు , ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపీనాథ్ , మా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,నిర్మాత బెక్కం వేణుగోపాల్,దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి,దర్శకుడు చంద్ర మహేష్ ఇలా అందరూ మా సినిమాను ఆశీర్వదించ డానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు ఎలా చరిత్ర సృష్టించాయో ఇప్పుడు వస్తున్న “ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ” కూడా చరిత్ర సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా చేశాము. గతం లో 76 సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. రేలంగి గారు ఇప్పటికీ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్, డి .ఓ. పి శంకర్ గారు డబ్బు కోసం కాకుండా ఎమోషన్ కు పని చేస్తారు తన కెమెరా పని తనం ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది , ఎడిటర్ వెలగపూడి రామారావు ,చీఫ్ కో డైరెక్టర్ రామారావు కూరపాటి, రఘు కుంచె,యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య ఇలా టీం అందరు మాకు ఎంతో ప్రేమగా ఫుల్ సపోర్ట్ తో సినిమాకు వర్క్ చేశారు. అందరూ ఎంతో కస్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అదిగమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…ఎన్నో హిట్ సినిమాలు తీసిన రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో మిత్రుడు ప్రసన్న నిర్మాణ సారద్యం లో వస్తున్న ఈ చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించారు ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు.మంచి కామెడీ హార్రర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
దర్శకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ..టైటిల్ చాలా బాగా ఉంది. ఈ టైటిల్ తో కథ రెడీ చేసి కామెడీ సినిమాగా మలచడం చాలా గ్రేట్. ప్రసన్న గారే టైటిల్ చెప్పి ఈ టైటిల్ తో దర్శకుడుతో మంచి కథ రెడీ చేయించుకుని సినిమా తీస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ టైటిల్ కు ఎలా జస్టిఫికేషన్ చేసారో తెలియాలి అంటే సినిమా తప్పక చూడాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
రాజా వన్నెం రెడ్డి మాట్లాడుతూ.. రేలంగి గారు నా గురువు. ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ టైటిల్ తో దెయ్యాల కథలో కామెడీ జోడించి చేసిన ఈ సినిమా ప్రసన్నకు, మా గురువు గారికి ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.
నిర్మాత ఆచంట గోపినాథ్ మాట్లాడుతూ..మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారకుడు రేలంగి నరసింహ రావు గారు. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎటువంటి అండలేని టైం లో నాకు రేలంగి,బాలయ్య బాబు లతో సినిమా చేసి నన్ను నిర్మాతగా నిలబెట్టారు.ఇప్పటికీ నిర్మాతగా వున్నాను అంటే దానికి వీరిచ్చిన సపోర్ట్ మరువలేను. .ప్రసన్న గారు మంచి డైరెక్టర్ ను సెలక్ట్ చేసుకుని,మంచి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రసన్న గారు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు. నేను ఈ రోజు నిర్మాతగా ఎదగడానికి తను నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు.రేలంగి గారు సినిమాలు చూసి ఇండస్ట్రీ కు వచ్చాను తను ఎంతో మంది నిర్మాతలకు సక్సెస్ నిచ్చాడు. అలాంటి వారితో చాలా పాజిటివ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రసన్న గారికి,ఈ చిత్రంలోని నటీనటులకు, టెక్నిషియన్స్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.
నటి సత్య కృష్ణ మాట్లాడుతూ.. ప్రసన్నగారి బ్యానర్ లో రేలంగి నరసింహారావు దర్శకత్వం లో మంచి కామెడీ హార్రర్ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేలంగి గారు నాకు గురువు లాంటి వారు తను ఎన్నో హిట్ మూవీస్ ఇచ్చారు.మంచి కామెడీ, హార్రర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ..ఈ మధ్య కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇలాంటి టైం లో ప్రపంచాన్ని ఊపేసిన పాటను టైటిల్ గా పెట్టి కామెడీ, హర్రర్ సినిమా తీస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద విజయం సాదించాలి అన్నారు.
నటుడు చిట్టి బాబు మాట్లాడుతూ..రేలంగి నరసింహరావు వంటి సీనియర్ దర్శకులతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. ప్రసన్న సర్ తను ఈ సినిమా చేసినా మంచి క్యారెక్టర్స్ ఇస్తూ వస్తున్నారు. ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు
హీరో యస్వంత్ మాట్లాడుతూ.. మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము.కంటెంట్ ను నమ్మే నిర్మాత, కంటెంట్ ను కరెక్ట్ గా ప్రాజెక్ట్ చేసే సీనియర్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది అన్నారు.
హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. ఎన్నో హిట్ సినిమాలు చేసిన ప్రసన్న సర్, రేలంగి సర్ లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ..చిన్న కమెడీయన్ గా చేస్తున్న నాకు రేలంగి సర్, ప్రసన్న సర్ లు తమ సినిమాలో హీరో గా నటించే అవకాశం కల్పించారు. వారికి నా ధన్యవాదాలు.ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నేను ఎదిగితే చూడాలి అనుకునే శంకర్ గారికి ధన్యవాదాలు.కామెడీ హార్రర్ తో వస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.
నటుడు,మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత వస్తున్న హాస్య భరిత చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాధాలు అన్నారు
నటీ నటులు
యస్వంత్ , జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్, రఘు కుంచె, సత్య కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు
సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ : ప్రసన్న కుమార్
దర్శకత్వం : రేలంగి నరసింహారావు
చీఫ్ కో డైరెక్టర్ : రామారావు కూరపాటి
కో డైరెక్టర్స్ : కోటి, గోలి వెంకటేశ్వర్లు
ఎడిటర్ : వెలగపూడి రామారవు
మ్యూజిక్ : సాబు వర్గీస్
మాటలుః అంగిరెడ్డి శ్రీనివాస్
డి .ఓ .పి : కంతేటి శంకర్
ఆర్ట్స్ :తెలప్రోలు శ్రీనివాస్
పిఆర్. ఓ : మధు వి. ఆర్