దర్శకుడు సంపత్ నంది ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను స్ఫూర్తిగా తీసుకొని ‘సింబా’ చిత్ర యూనిట్ తో కలిసి వంద మొక్కలను నాటారు.

ప్రముఖ సినిమా దర్శకుడు సంపత్ నంది తన పుట్టినరోజు సందర్భంగా కడ్తాల్ లోని తన ఫాంహౌజ్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను స్ఫూర్తిగా తీసుకొని ‘సింబా’ చిత్ర యూనిట్ తో కలిసి వంద మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… సినీ డైరెక్టర్ సంపత్ నంది గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా ‘సింబా’ చిత్ర యూనిట్ తో కలిసి మొక్కలను నాటడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా కూడా ఫారెస్ట్ ఆఫీసర్ నేపధ్యంతో ప్రకృతికి దగ్గరగా నిర్మిస్తుండటం గొప్ప విషయమన్నారు. ‘సింబా’ చిత్రం మంచి విజయాన్ని స్వంతం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని ఎంపీ సంతోష్ కుమార్ వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.