కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ “వినరో భాగ్యము విష్ణుకథ” కి వన్ ఇయర్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా “వినరో భాగ్యము విష్ణుకథ”. ఇవాళ్టితో ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తవుతోంది.  “వినరో భాగ్యము విష్ణుకథ”మూవీ టీమ్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించారు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించగా..మురళీ శర్మ ఓ ముఖ్య పాత్ర చేశారు. గతేడాది ఫిబ్రవరి 18న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చిన “వినరో భాగ్యము విష్ణుకథ” అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది.

“వినరో భాగ్యము విష్ణుకథ” సినిమాలో కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలించింది. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన “దిల్ రూబా” సినిమాతో పాటు ఆయన సొంత ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.