మరోసారి మానవత్వం చాటుకున్న చిరంజీవి

తెలుగు సినిమా పరిశ్రమలో తనంతట తానుగా కష్టపడి ఎదిగి ఉన్నత స్థాయికి చేరిన వారిలో చిరంజీవి ఒకరు. నటన మీద చిరంజీవికి ఉన్న ఆసక్తి అంత ఇంత కాదు. అందుకు ఆయన ఆ 150 కు పైగా తీసిన సినిమాలే రుజువు అని చెప్పుకోవాలి. ఆయనకు సినిమాలు ఎంత ఇష్టమో, అభిమానులు కూడా అంతే ఇష్టం. అలాగే సినీ జర్నలిస్టులు అంటే చిరంజీవికి మరింత ఇష్టం. సినీ జర్నలిస్టులకు ఆయన ఎప్పుడు అందగానే ఉంటారు.

కష్టం తెలిసిన వ్యక్తిగా తన కాళ్ళ ముందు ఎవరు కష్టాలలో ఉన్నాకూడా వారికి వెంటనే సహాయపడతారు. ఇక సినీ జర్నలిస్టులు అంటే ప్రత్యేక శ్రద్ధ అనే చెప్పుకోవచ్చు. ఓ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు చిరంజీవి తోటి వారే. అయితే కొన్నేళ్ల అనారోగ్యం తో బాధపడుతున్న విషయం వేరే వారి ద్వారా తెలుసుకున్న చిరంజీవి స్వయానా ఆయన వెళ్లి రామ్మోహన్ గారిని కలిసి పరామర్శించారు. అంతే కాకుండా ఆయన ఆరోగ్యం గురించి పూర్తగా తెలుసుకుని మంచి వైద్యం అందేలా వైద్యులతో మాట్లాడారు.

అలాగే పసుపులేటి రామారావు అనే మరో జర్నలిస్ట్ కష్టపడుతున్న విధానం చూసి ఆయన పాత్రా పోషించారు చిరంజీవి. ఒకసారి షూటింగ్ స్పాట్ కు రామారావు వచ్చారని తెలుసుకున్న చిరంజీవి ఆయనను భోజనానికి స్వాగతించారు. కానీ రామారావు ఇంటికి వెళ్లిపోయారు. దానితో స్వయానా చిరంజీవి రామారావు గారి ఇంటికి వెళ్లి మీరు ఎందుకు ఇలా వచ్చేసారొకని, నేను ఈరోజు మీతో కలిసి మీ ఇంట్లోనే భోజనం చేయాలి అనుకుంటున్నాను అన్నారు. అలాగే రామారావు కుటుంబంతో కలిసి భోజనం చేసారు.

కొన్ని సంవత్సరాల తరువాత రామారావు కు గుండె సమస్య వచ్చింది అని తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్టార్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి రామారావు కు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తహెసుకోమని డాక్టర్లను సూచించారు.

అలాగే ఓ ప్రముఖ జర్నలిస్ట్ బి.జయ గారు తరువాత దర్శకురాలుగా మారారు. ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆయన భర్త బి ఏ రాజు గారు జర్నలిస్ట్. ఆవిడ అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారు అని తెలుసుకున్న చిరంజీవి ఎంతగానో బాధపడ్డారు. వెంటనే ఆమె భర్త బి ఆ రాజు ఇంకా కుటుంబ సభ్యులను స్వయానా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జర్నలిస్ట్ బి ఆ రాజు గారు అంటే చిరంజీవికి మరింత అబ్జిమానం, గౌరవం.

అలాగే 4 రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ అయినా ప్రభు గారు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు అని తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్టార్ హాస్పిటల్ తో సంప్రదించారు. ప్రభు గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని డాక్టర్లకు వివరించగా బైపాస్ సర్జరీ చేయకుండా కేవలం స్తుంటీస్ తోనే సర్జరీ జరిగేలా చూసారు. దానికి గాను పూర్తి ఖర్చు చిరంజీవి పెట్టుకున్నారు.

అంతే కాకుండా కరోనా సమయంలో కూడా చిరంజీవి జర్నలిస్టులకు అండగా నిలిచారు. జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చిన తానే ముందు ఉంది వారి సమస్యను తీసుచేవారు. కష్టం తెలిసిన వ్యాథిగా అది తన బాధ్యతలా తీసుకునేవారు చిరంజీవి. అందుకే జర్నలిస్టులు అంత చిరంజీవిని ‘దైవం మనుష్య రూపేణా’ అని కొనియాడుతారు.