ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఒక పథకం ప్రకారం’

సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సొదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై… గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర విశేషాలు వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర కథానాయకుడు సాయిరామ్ శంకర్, నిర్మాత గార్లపాటి రమేష్, దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్, సహనిర్మాతలు జీను మల్లి – స్వాతి కళ్యాణిలతోపాటు.. ఈచిత్రాన్ని విడుదల చేస్తున్న శ్రీలక్ష్మి ఫిలిమ్స్ బాపిరాజు పాల్గొన్నారు. ఈ సినిమాను ఇంటర్వెల్ వరకు చూసి… విలన్ ఎవరో చెప్పగిలిగినవారికి… 50 థియేటర్ల నుంచి.. థియేటర్ కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున బహుమతి అందిస్తామని హీరో సాయిరామ్ శంకర్ ప్రకటించారు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినప్పటికీ… విలన్ ఎవరో.. ఎవరొకాని కనిపెట్టలేరని తాము భావిస్తున్నామని, అయితే 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున 5 లక్షలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ పేర్కొన్నారు!!

ముందుగా బాపిరాజు మాట్లాడుతూ… ఇటీవలకాలంలో రానంత ఒక మంచి చిత్రాన్ని మా లక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో విడుదల చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు!!

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ… “ఇది నా కెరీర్ కి ఎంతో హెల్పయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ ఆవుతుంది. ఈచిత్ర దర్శకుడు వినోద్ తో నేను 2005 నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అసాధారణమైన ప్రతిభ కలిగిన వ్యక్తి. ప్రతిష్టాత్మక బెర్లిన్ అవార్డుతోపాటు నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి. ఇందులో నేను సీదార్ధ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించాను. నా నటనలో చిన్నపాటి కృత్రిమత్వం కూడా ఉండకూడదని నెలరోజులపాటు నేషననల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని నటించాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో చాలామంది నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారు. నేను మళ్ళీ భవిష్యత్తులో ఇంతటి టెక్నీకల్లీ రిచ్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ వస్తుందని నేననుకోను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ. ఇటువంటి సినిమ కోసమే ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను. ఇందులో నా పాత్ర స్టోరీని డ్రైవ్ చేస్తుంది” అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఇన్నేళ్ల తర్వాత కూడా కథల ఎంపికలో, కెరీర్ విషయంలో తన అన్నయ్య పూరి జగన్నాధ్ ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నది తన భావన అని… అన్నయ్య మోరల్ సపోర్ట్ తనకు ఎప్పుడూ ఉంటుందని, అడగడం ఆలస్యం సలహాలు-సూచనలు ఇస్తారని సాయిరామ్ తెలిపారు!!

చిత్ర దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ… నాకు చిన్నప్పటినుంచి తెలుగు సినిమాలన్నా, తెలుగువాళ్ళన్నా, తెలుగు పచ్చళ్లన్నా చాలా చాలా ఇష్టం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి. రెండు పాటలూ సిడ్ శ్రీరామ్ పాడారు. రాజీవ్ రాయ్ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.

ఒక పథకం ప్రకారం” వంటి ఒక మంచి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాతల్లో ఒకరైన గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి – స్వాతి కల్యాణి!!

తారాగణం : శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు.

ఛాయాగ్రహణం: రాజీవ్ రాయ్

సంగీతం: రాహుల్ రాజ్

ఆర్.ఆర్: గోపి సుందర్

ఎడిటింగ్: కార్తీక్ జోగేష్

ఆర్ట్; సంతోష్ రామన్

లిరిక్స్: రహమాన్

సింగర్: సిడ్ శ్రీరామ్

పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ

సహనిర్మాతలు: జీను మల్లి – స్వాతి కల్యాణి

బ్యానర్స్: వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రయివేట్ లిమిటెడ్

నిర్మాతలు: వినోద్ కుమార్ విజయన్ – గార్లపాటి రమేష్

కథ – స్క్రీన్ ప్లే – సంభాషణలు – దర్శకత్వం: వినోద్ కుమార్ విజయన్