ఇండియాలో అందరినీ ఆకట్టుకుంటో ముందుకుసాగుతోన్న స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ముందు వరుసలో ఉంది. ఇలాంటి మాధ్యమంలో రీసెంట్‌గా థియేటర్స్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘నునక్కుళి’ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కావటాని కంటే ముందే జీ5 కేరళలో ప్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ను సాధించటం విశేషం. ఈ క్రమంలో మనోరథంగల్, పప్పన్, సూపర్ శరణ్య చిత్రాలను ఈ చిత్రం అధిగమించింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో బాసిల్ జోసెఫ్ ను మరో విలక్షణమైన పాత్రలో చూడటానికి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నునక్కుళి సినిమా సెప్టెంబర్ 13 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నునక్కుళి సినిమా విషయానికి వస్తే ఎబి (బాసిల్ జోసెఫ్)కు సంబంధించిన కథ. ఇతని ల్యాప్ ట్యాప్‌ను ఓ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సీజ్ చేస్తాడు. అందులో ముఖ్యమైన సమాచారం అంతా ఉంటుంది. దాన్ని తిరిగి పొందటానికి ఎబి ఏం చేశాడనేదే సినిమా. ఈ మిషన్‌లో రెష్మిత (గ్రేస్ ఆంటోని) అనే విడాకులు తీసుకున్న మహిళతో కలిసి ప్రయాణం చేస్తాడు. ఇందులో చనిపోయిన ఓ దంతవైద్యుడు, నిర్బంధంలోని ఓ మహిళ, ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వ్యక్తి తారసపడతారు. వారి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. కథలో ఉహించని ట్విస్టులు ఎదురవుతాయి. ఎబి తన రహస్యాలను బయట పడకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటే ఓ ట్విస్ట్ కారణంగా తన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఉహించని మలుపులతో పాటు చక్కటి హాస్యం కూడా మిళితమైన సినిమాగా నునక్కుళి ప్రేక్షకులను మెప్పిస్తుంది.
సెప్టెంబర్ 13 నుంచి జీ5లో ‘నునక్కుళి’ మలయాళంతోపాటు కన్నడ, తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోలర్ కోస్టర్ జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా ఎంజాయ్ చేయండి.