ఎన్టీఆర్ ‘దేవర’ నార్త్ ఇండియన్ రైట్స్ సొంతం చేసుకున్న ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మ్స్

కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో మాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తూ మన ముందుకు రాబోతున్న సినిమా దేవర. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్ర టీజర్ ఇంటర్నెట్లో సెన్సేషన్ సృష్టించింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వస్తున్న డైలాగ్స్ అభిమానులను అలాగే ప్రేక్షకులను ఎంతగానో మరణించాయి.

ఈ సినిమా పైన అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. బాలీవుడ్‌ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్‌ మేజర్‌ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలుపుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు.

 ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, నరేన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.