ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ విడుదలకు అనుమతిస్తూ కొత్త GO ద్వారా సినిమాకు సపోర్టు ఇచ్చినందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ ముందు ముందు సినిమా ఇండస్ట్రీకి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదిక X ద్వారా తెలిపారు.