చరిత్ర సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. దీనికి సంబంధించిన టీజర్ కొద్ది నెలల క్రితం విడుదలైంది. ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వ్యూస్, అత్యధిక లైక్స్, అత్యధిక కామెంట్స్ సాధించిన టీజర్‌గా చరిత్ర సృష్టించింది.

NTR BHEEM TEASER RECORD

టీజర్ల పరంగా తక్కువ కాలంలో అత్యధిక లైక్స్, కామెంట్స్, వ్యూస్ సాధించిన టీజర్‌గా ఎన్టీఆర్ భీమ్ టీజర్ నిలిచింది. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఇది నిలవడంతో.. ఇక సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందనేది చూడాలి.