మెగాస్టార్ వాయిస్‌తో ఆర్ఆర్ఆర్ చిత్ర టీజ‌ర్?.. నిజ‌మేనా..‌

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. ఈ సినిమాకి సంబంధించిన 70శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన చిత్ర‌బృందం. అయితే కొత్త సంవ‌త్స‌ర సంద‌ర్భంగా ఏదైనా విడుద‌ల చేస్తార‌ని అభిమానులు భావించారు. ఈ ఏడాది మీకు అద్భుత‌మైన అనుభూతిని ఇస్తాం అంటూ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్‌ను మాత్రం పంచుకున్నారు.

rrr movie

దీంతో సంక్రాంతి సంద‌ర్భంగా ఏదైనా రిలీజ్ చేస్తారా అంటూ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ వార్తా ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న నేప‌థ్యంలో.. జ‌వ‌వ‌రి 26 రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్న‌ర‌ట ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కావ‌డంతో రిప‌బ్లిక్‌డే నాడు రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం అనుకుంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌తో త్వ‌ర‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి టీజ‌ర్‌ను రూపొందించాల‌ని చిత్ర‌యూనిట్ యోచిస్తోంద‌ట‌. ఈ వార్తా ఫిల్మ్‌వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా.. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. ఇదిలా ఉంటే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్ న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ‌గ‌ణ్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.