ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇక లేరు

అనేక టాప్ టాలీవుడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ (76) మంగళవారం కన్నుమూశారు.
గత కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నారాయణ్ దాస్ నారంగ్ 1980లలో సినిమా ఫైనాన్సర్‌గా తన వృత్తిని ప్రారంభించారు మరియు నాలుగు దశాబ్దాల పాటు 650 చిత్రాలకు పైగా ఫైనాన్స్ చేశారు. ఆయన హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు మరియు గతంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవలి కాలంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవిల లవ్ స్టోరీ మూవీ మరియు నాగ శౌర్య యొక్క లక్ష్య మూవీలను ప్రొడ్యూస్ చేసారు. ధనుష్ మరియు శివకార్తికేయన్‌ల కాంబినేషన్ లో ఒక చిత్రం మరియు నాగార్జున, కాజల్ అగర్వాల్ యొక్క ది ఘోస్ట్‌ మూవీలు నిర్మిస్తున్నారు .

నారాయణ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమారులు సునీల్ నారంగ్ మరియు భరత్ నారంగ్ ఇద్దరూ చురుకైన చిత్ర నిర్మాతలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ యాత్రలు ప్రారంభం కానున్నాయి.