మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా తన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ విధంగా సందేహం ఇచ్చారు.
“దయచేసి అందరూ బైక్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. నాకు జరిగినట్లు ఇంకా ఎవరికీ జరగడం నాకు ఇష్టం లేదు. అదేవిధంగా కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకుని నడపండి. ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా వేధింపులు జరుగుతున్నాయి. ఎక్కువగా చిన్న పిల్లలపై చేస్తున్నారు. నా కుటుంబం పై కూడా ఇటువంటివి కొన్ని జరిగాయి. మా ఇంట్లో చిన్న పిల్లలను కూడా అబ్యూజ్ చేస్తూ మాట్లాడారు. అందుకే నేను ఎవరైనా చిన్నపిల్లలను అబ్యూస్ చేస్తే వెంటనే స్పందిస్తాను. నాకు ఒక బాధ ఎలా ఉంటుంది అనేది తెలుసు. మా కళ్యాణ్ మామయ్య ఆలోచన పరంగా బలవంతుడు కాబట్టి ఆయన అటువంటి వేధింపులు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డారు. నేను ఆరోజు స్పందించడానికి కూడా కారణం ఏంటంటే ఈ సంఘటన జరిగి 24 గంటలు పైనే అయినా కూడా ఆ సంఘటనపై ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కనీసం మీడియాలో కూడా చూపించలేదు. అందుకే నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా కొందరికి ఇటువంటి అభ్యంతరమైన కామెంట్లు చేయడం సులువు అయిపోయింది. అటువంటి పనులు చేసే వారికి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు వారి స్థానంలో ఉండి ఆలోచించండి. మీకు గాని, మీ కుటుంబ సభ్యులకు గానీ అటువంటి వేధింపులు ఎదురైతే మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది ఆలోచించండి. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎవడికైనా అటువంటి మాటలు అనేముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాటి వల్ల వారి అభిమానులు కూడా ఎంతగానో హర్ట్ అవుతారు. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరొక్కసారి ఆలోచించండి” అన్నారు.