`బ్రోచేవారెవ‌రురా`లో నివేదా థామ‌స్ లుక్‌

`బ్రోచేవారెవ‌రురా`… టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్న సినిమా. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి నివేదా థామ‌స్ ఆ మ‌ధ్య గొప్ప‌గా చెప్ప‌డంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో హీరో లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా హీరోయిన్ లుక్‌ను ఆవిష్క‌రించింది. ఈ స్టిల్‌లో మ‌ల‌యాళీ బ్యూటీ నివేదా థామ‌స్ క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ పాత్ర‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ స్టిల్‌ బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. `చ‌ల‌న‌మే చిత్ర‌ము, చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనే ట్యాగ్‌లైన్ టైటిల్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. స‌త్య‌దేవ్‌, నివేదా పెతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ సపోర్టింగ్ పాత్ర‌ల‌తో మెప్పిస్తారు. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. `బ్రోచేవారెవ‌రురా` షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

న‌టీన‌టులు:
శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేదా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం
సంస్థ‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
కెమెరా: సాయి శ్రీరామ్‌
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
పీఆర్వో: వ‌ంశీ శేఖ‌ర్‌