‘రంగ్ దే’ కంటే ముందు ‘చెక్‌’తో నితిన్

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 19న చెక్ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ నిర్మించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు కీలక పాత్రలలో నటించారు. కల్యాన్ మాలిక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ఇక పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

అయితే నితిన్ నటించిన రంగ్ దే సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందే పూర్తయింది. ఆ తర్వాత లాక్‌డౌన్ రావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో లాక్‌డౌన్ తర్వాత రంగ్ దే సినిమా విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ చెక్ సినిమా విడుదల కావడం గమనార్హం.