నితిన్, వక్కంతం వంశీ, శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ నెం. 9 చిత్రం ప్రారంభం

నితిన్ హీరోగా తన 32వ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ బేనర్ లో చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఆదివారంనాడు ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమయింది. ముహూర్తం షాట్కు పుస్కూర్ రామ్మోహన్ రావు క్లాప్ కొట్టగా, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, ఠాగూర్ మధు చిత్ర దర్శకుడు వక్కంతం వంశీ కి  స్క్రిప్ట్ను అందజేశారు.

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న `మాచర్ల నియోజకవర్గం` సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  ఇప్పటికే టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. మాచర్ల నియోజకవర్గం సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పూర్తిగా భిన్నమైన పాత్రలో  నితిన్ ను చూపించబోతున్నాడు. నితిన్  కోసం ఆయన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు.  .

ప్రముఖ టెక్నీషియన్స్ పని చేయనున్న ఈ చిత్రాన్ని  శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నెం 9గా రూపొందిస్తుండగా,  రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతుండగా సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.గా పనిచేస్తున్నారు.

తారాగణం: నితిన్, శ్రీలీల తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ: రాజ్కుమార్ ఆకెళ్ల
సంగీతం: హారిస్ జయరాజ్
DOP: సాయి శ్రీరామ్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్