నితిన్ సినిమా ‘తమ్ముడు’ కొత్త పోస్టర్ విడుదల

ఈరోజు హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వారు నితిన్ తో తమ సినిమా టైటిల్ తో కలిపి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ద్వారా ఈ చిత్రం మన ముందుకు రానుంది. అయితే సినిమా టైటిల్ ‘తమ్ముడు’ కావడంతో సినిమా పై అంచనాలు ఇంకాస్త ఎక్కువ అయినాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినా నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాని తన సినిమా టైటిల్ గా పెట్టుకోవడంతో తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తే నితిన్ ఓ పాత బస్సు పైన ఓ బల్లెం పట్టుకుని కూర్చుని ఉండగా ఆ బస్సు ఓ గిరిజన మహిళా నడుపుతుంటుంది. అయితే ఇంత వరుకు నితిన్ ని ఎప్పుడు చూడనంత కొత్తగా చూడొచ్చు అనిపిస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్ ల కోసం వేచి చూడాల్సిందే.