రవితేజ సినిమాలో బాలీవుడ్ స్టార్

క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా మేకర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ నటించనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వెల్ కమ్ అంటూ ఖిలాడి మేకర్స్ ఒక పోస్ట్ పెట్టారు.

NIKITIN DHEER IN KHILADHI

అయితే ఇందులో యాక్షన్ హీరో అర్జున్ నటించనున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించింది. అలాగే జబర్తస్త్ యాంకర్ అనసూయ కూడా నటించనున్నట్లు తెలిపింది. ఇందులో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించింది.