ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలుసా?

రేడీయో జాకీగా కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్.. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఇప్పుడు ఏకంగా హీరోగా మారాడు. యాంకర్‌గా బుల్లితెరపై బెస్ట్ మేల్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్.. తన మార్క్ కామెడీ, సెటైర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరోవైపు హీరోగా కూడా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా మిక్స్ డే టాక్‌ను అందుకుంది.

PRADEEP ONE NONTH INCOME

అయితే హీరోగా మరో సినిమా కూడా చేసేందుకు ప్రదీప్ సిద్ధమయ్యాడు. తన రెండో సినిమా వివరాలు త్వరలో వెల్లడిస్తానని, ప్రస్తుతం ఫస్ట్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నానని ప్రదీప్ తెలిపాడు. ఈ క్రమంలో ప్రదీప్ నెల సంపాదన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రదీప్ నెలకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే టాక్ నడుస్తోంది.