లెటర్ల నుంచి ఆన్లైన్ మెసేజ్ల వరకూ వచ్చిన ఈరోజుల్లో ఒక యంగ్ హీరోయిన్ మాత్రం తనకి పాత రోజుల ప్రేమనే కావాలి, ఆ ప్రేమతో రాసే కథలే కావాలి అంటుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఆమె మాటలు ఎవరి గురించి అనే కదా… అనుపమ నందినిగా మారి నిఖిల్ కోసం తన ఫీలింగ్స్ ని రాయడం మొదలుపెట్టింది. సుకుమార్ కథ అందిస్తున్న 18 పేజెస్ సినిమాలో ఈ ఇద్దరూ లీడ్ పెయిర్ గా యాక్ట్ చేస్తున్నారు. చాలా హైప్ ఉన్న ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నిఖిల్ బర్త్ డే సంధర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ లో షేర్ చేసిన అనుపమ… “నా పేరు నందిని నాకు మొబైల్ లో అక్షరాలని టైపు చేయడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైపు చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు ఎవరు టైపు చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.” అంటూ పోస్ట్ చేసింది. నిఖిల్ ని కుర్చీలో కూర్చో పెట్టి కళ్లకి గంతలు కట్టి, ఆ గంతల పైన పెన్ పెట్టి రాస్తున్నట్లు ఉన్న అనుపమ లుక్ చాలా బాగుంది. ఈ 18 పేజెస్ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. లీడ్ పెయిర్ మంచి కెమిస్ట్రీ కుదిరినట్లు ఉంది. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.