పెళ్లికి ముందు ప్రేమ కథలో నిహారిక..?

టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక కొణిదెల మరికొన్ని నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డ అనే యువకుడిని పెళ్లి చేసుకోనున్న నిహారికపై ప్రస్తుతం ఒక రూమర్ వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఆ వెబ్ సిరీస్ ని మెగా డాటర్ సుష్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సుష్మిత న్యూ ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ ఆనంద్ రంగాతో ఒక ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసింది. అయితే నిహారికతో కూడా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నిహారిక నిశ్చితార్థం జరగనున్నట్లు అన్నయ్య వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పెళ్లి డిసెంబర్ లో సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు.

అయితే పెళ్లి చేసుకున్న తరువాత నిహారిక సినిమా కెరీర్ కొనసాగుతుందా లేదా అనే విషయంలో అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. దాదాపు ఆమె యాక్టింగ్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పెట్టి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉందని రూమర్స్ వస్తున్నాయి. మరి ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.