మెగా ఫ్యామిలీలో కూడా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీ పెళ్లి సందడితో అందరిని ఎట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా కొణిదెల వారి కూతురు నిహారిక కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో నిహారిక – జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ వారి సతిమణులతో ఎంగేజ్మెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. యువ హీరోలు సాయి ధరమ్ తేజ్ అలాగే వైష్ణవ్ తేజ్, మెగా సిస్టర్స్ కూడా వేడుకలో పాల్గొన్నారు. కేవలం 50మంది లోపే వీరి నిశ్చితార్థ వేడుకలో పాల్గోన్నట్లు తెలుస్తోంది. పెళ్లిపై ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. డిసెంబర్ లో పరిస్థితులను బట్టి నిర్వహించే అవకాశం ఉందని గత ఇంటర్వ్యూలో నాగబాబు వివరణ ఇచ్చారు. అయితే వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.