కుర్ర‌కారును పిచ్చేక్కించేలా చీర‌లో ఇస్మార్ట్ భామ‌..

పూరీజ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది నిధి అగ‌ర్వాల్‌. బాలీవుడ్‌లో టైగ‌ర్ ష్రాఫ్ జోడీగా మున్నా మైఖేల్ చిత్రంతో హీరోయిన్‌గా సినిమాల్లో అడుగుపెట్టిన నిధి.. అక్క‌డి వాళ్లు ఈ భామ‌ అందాల‌ను చూసి అదిరిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ గ్లామ‌ర్ షో అదిరిపోయింది.. కానీ అవ‌కాశాలు మాత్రం రావ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలోనే తెలుగులో స‌వ్య‌సాచి సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామకు..

nidhiaggrwal

ఈ చిత్రం ప్లాప్ అవ్వ‌డంతో, భారీ గ్యాప్ తీసుకుని మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టించింది. ఈ భామ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లాప్‌లు అవుతున్న క్ర‌మంలో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో తొలి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాలో నిధి గ్లామ‌ర్‌ భారీగా పెంచేసింది. ఇక ఈ ఇస్మార్ట్ భామ సినిమాల‌తో పాటు అప్పుడ‌ప్పుడు మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల కోసం ఫోటో షూట్‌లో త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది. ఎప్పుడు వేడెక్కించే అందాల‌ను ఆర‌బోసే నిధి.. తాజాగా ‌చీర ధ‌రించి కుర్ర‌కారును మ‌తులు పోగ‌డుతుంది. సోష‌ల్ మీడియాలో ఇలా ట్రెడిష‌న్ లుక్‌లో కనిపించిన నిధిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదిలాఉంటే.. నిధి అగ‌ర్వాల్ న‌టించిన త‌మిళ చిత్రం ఈశ్వ‌ర‌న్ సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది.