రెడ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా రెడ్. మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. నిన్న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీత్ తెరకెక్కిన ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి కిషోర్ నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన తడమ్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది.

ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రాగా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు బాగానే వచ్చాయి. తొలి రోజు రూ. 8.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, రూ. 5.47 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో రూ. 2.04 కోట్లు, రాయలసీమ (సీడెడ్) 1.10 కోట్లు, మిగిలిన ఏపీలో 2.33 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ. రూ. 5.47 షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..